Stephen Bob Songs
Stephen Bob Songs
Samastha Janulaara Song Lyrics
సమస్త జనులారా LYRICS
Stephen Bob Songs
పల్లవి:
సమస్త జనులరా, యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి – ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి
యెహోవాయే దేవుడని తెలిసికొనుడి – సంతోష గానముతో ఆరాధించుడి
చరణం 1:
పరిశుద్ధ దేవుని కీర్తించుడి – స్తుతి గీతాలతో ఉల్లాసించుడి ( 2 )
ఆనందమే ఆరాధనగా – సంతోష రాగమే స్తోత్ర ధ్వనిగా ( 2 )
హృదయముతో ప్రార్థనల జ్యోతిని వెలిగించుడి ( 2 ) || యెహోవాయే దేవుడని తెలిసికొనుడి ||
చరణం 2:
క్రీస్తు యేసు నామమును ఘనపరచూడి – రక్షణ మార్గమని గ్రహించుడి ( 2 )
నీ ఆత్మను సమర్పించగా – పాపమునుండి విడిపించునుగా ( 2 )
హృదయంతో కీర్తిస్తూ క్రీస్తుని ప్రేమించుడి ( 2 ) || యెహోవాయే దేవుడని తెలిసికొనుడి ||
చరణం 3:
పరిశుద్ధ ఆత్మను సేవించుము – పరలోక అభిషేకము అనుభవించుము
నీ స్పర్శతో, నను తాకుమా – అగ్నిజ్వాలవై రగిలించుమా
హృదయంతో హర్షిస్తూ ఆత్మను ఘనపరచుడి || యెహోవాయే దేవుడని తెలిసికొనుడి ||
Pallavi:
Samasta janularaa, Yehovaaku utsaahadhwani cheyudi
Utsaahagaanamu cheyuchu Aayana sannidhiki randi
Yehovaaye Devudani telisikondi
Santosha gaanamutho aaraadhinchudi
Charanam:
Parisuddha Devuni keerthinchudi – Stuthi geethalatho ullaasinchudi
Aanandame aaraadhanagaa – Santosha raagame stotra dhwanigaa
Hrudayamtho praarthanal jyothini veliginchudi || Yehovaaye Devudani telisikondi||
Charanam:
Kreesthu Yesu naamamunu ghanaparachudi – Rakshana maargamani grahinchudi
Nee aathmanu samarpinchagaa – Paapamunundi vidipinchunugaa
Hrudayamtho keerthisthu Kreesthuni preminchudi || Yehovaaye Devudani telisikondi ||
Charanam:
Parisuddha Aathmanu sevinchumu – Paraloka abhishyekamu anubhavinchumu
Nee sparshatho, nanu taakumaa – Agnijwaalavai ragilinchumaa
Hrudayamtho harshisthu Aathmanu ghanaparachudi || Yehovaaye Devudani telisikondi ||